సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన కేసులో యుట్యూబ్ పై హైకోర్టు సీరియస్ అయింది. కొత్త టెక్నిక్‌తో పంచ్ ప్రభాకర్ యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు న్యాయవాది అశ్వని కుమార్. అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని.. అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని తెలిపారు హైకోర్టు తరపు న్యాయవాది అశ్వని కుమార్. ప్రైవేట్ వ్యూస్‌ని ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారని కోర్టుకు వివరించారు అశ్విని కుమార్ అఫడవిట్.
సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పంచ్ ప్రభాకర్ గురించి ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం చేసింది కోర్టు. పంచ్ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని సీబీఐని ప్రశ్నించింది హైకోర్టు. అమెరికాలో ఉండడంతో ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని చెప్పింది సీబీఐ. మార్చి 21 వ తేదీలోపు ప్రభాకర్ అరెస్ట్‌కు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో హైకోర్టుకి నివేదించాలని కోరింది ధర్మాసనం. ప్రైవేట్ వ్యూస్ నిషేధించడానికి తీసుకుంటున్నచర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసును వచ్చే నెల 21వ తేదీకి విచారణ వాయిదా వేసింది.