మేక‌పాటికి స్పీక‌ర్ త‌మ్మినేని నివాళి

-

శ్రీకాకుళం : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం జీర్ణించుకోలేకపోతున్నానని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ను పారిశ్రామికంగా అభివృద్ధికి భారీ పెట్టుబడులు కొరకు ఇటీవల దుబాయ్ లో పర్యటించి అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ ను తయారుచేసే అమెరికాకు చెందిన ఆలు బాండ్ గ్లోబల్ సంస్థ ద్వారా రాష్ట్రంలో రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారని, షరాఫ్ గ్రూపు తో పోర్ట్ ఆధారిత సేవల రంగం పై పెట్టుబడులు పెట్టడానికి రూ.500 కోట్లతో రెండు లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలని దృఢసంకల్పంతో పనిచేసారని,  మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తీరని లోటని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఆయన సొంతం. ఆయన జీవితం ఎంతో మంది యువకులకు ఆదర్శం. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని అన్నారు. మేకపాటి మరణించారన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నానని ఎంతో భవిష్యత్తు కలిగిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మరణించడం ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆయన కుటుంబానికి తీరని లోటని ఆయన అన్నారు. నిండుగా ఎప్పుడు చెరగని చిరునవ్వుతో ఉండే వ్యక్తి మరచిపోలేని జ్ఞాపకాలను మన మధ్య విడిచిపెట్టి మరణించడం చాలా బాధగా ఉందని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని వారి కుటుంబం పట్ల భగవంతుడు కరుణా, కటాక్షాలు ఎల్లవేళలా ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news