జగన్ సర్కార్ పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు అంటూ దాఖలు వైన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణ కు నలుగురు ఐఏఎస్ లు జీకే ద్వివేది, గిరిజాశంకర్, శ్రీలక్ష్మి మరియు విజయ్ కుమార్ హాజరయ్యారు.
ఆ పాఠశాల ఆవరణలో ఇలాంటి భవనాలు నిర్మించవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించడంలేదని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించింది. తాము ఆదేశించినా నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి అని నిలదీసింది. హైకోర్టు ఆదేశాలను సరిగా పాటించడం లేదని ఆ విషయాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయి విచారణను ఈ నెల ఆఖరుకు విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.