జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హై కోర్టు సీరియ‌స్‌.. మేమూ మనుషులమే!

ఏపీ హైకోర్టును ఉద్దేశించి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జస్టిస్ బట్టు దేవానంద్. ఎంతో మంది ప్రాథ‌మిక హక్కులను కాపాడుతున్నామ‌ని.. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని ఆయ‌న ఫైర్ అయ్యారు. కొంతమంది జుడీషియల్ సెలెబ్రిటీలు లైమ్ లైట్ లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని..అలాంటి లైట్స్ ఆపేస్తామ‌న్నారు ఏపీ ఛీఫ్ జస్టిస్. మేమూ మనుషులమే.. కొన్ని తప్పులు జరుగుతుంటాయని పేర్కొన్నారు.

హ్యూమన్ రైట్స్ డే ని అడ్రస్ చేయడానికి వచ్చిన ఆయన దాని గురించి మాట్లాడితే బాగుండేదని.. మేము పరిధి దాటామని మాట్లాడామని అనటం సరికాదన్నారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని… ఒక డాక్టర్ ను పొలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు.. హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళండన్నారు. మంచి డైరెక్టర్ తో సినిమా తీయించండని… దేశంలో ఇతర హైకోర్టులతో పోలిస్తే, జడ్జి నుంచి కక్షిదారుల వరకూ ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని.. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా అని ప్ర‌శ్నించారు.