ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్

-

ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ మరో షాకిచ్చింది. విశాఖ వాల్తేర్ క్లబ్ వివాదంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సిట్ విచారణ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేర్ క్లబ్ కు సంబంధించిన సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవద్దని సిట్ కి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం నగర నడిబొడ్డున వున్న వాల్తేరు క్లబ్‌ భూములపై సిట్‌ విచారణ చేపట్టింది.

ap-high-court
ap-high-court

ఆ భూములపై క్లబ్‌ కు హక్కు లేదని, వారు లీజుకు మాత్రమే తీసుకున్నారని, ఆ గడువు ముగిసిపోయినా ఇంకా కొనసాగుతున్నారని అవన్నీ ప్రభుత్వ భూములని సిట్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకే ఈ విచారణ చేపట్టినట్టు సిట్ గతంలో ప్రకటించింది. ఇటు క్లబ్‌ యాజమాన్యానికి నోటీసు జారీచేసి, ఆధారాలు, పత్రాలతో రావాలని ఆదేశించింది. అయితే ఈ అంశం మీద క్లబ్ హైకోర్ట్ ని ఆశ్రయించగా ఇప్పుడు సిట్ విచారణ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news