ఏపీ ఉద్యోగుల చలో విజయవాడ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచరిత కీలక ప్రకటన చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని.. చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దమని మండిపడ్డారు. ఉద్యోగులు సహకరించాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారని.. కమిటీ కూడా వేశామని గుర్తు చేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నామని.. ఉద్యోగుల హౌస్ అరెస్టు లు లేవని ప్రకటన చేశారు.
అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పామని.. ఎవరిని అరెస్ట్ చేయలేదని వెల్లడించారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నా యన్నారు. వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నామని.. జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారు .. వివాదం సృష్టించడం సిగ్గు చేటు అన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరమని.. జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బిజెపి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఐక్యతతో ఉండటం కారణంగానే ప్రశాంతంగా ఉంటున్నామని.. జాతీయ జెండా ఆవిష్కరించి మంచి ముగింపు ఇచ్చారని పేర్కొన్నారు.