‘పుష్ప’ స్టైల్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చెయ్యాలని ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్…!

-

అల్లు అర్జున్ పుష్ప సినిమా అందరినీ బాగా ఆకట్టేసుకుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం పుష్పా డైలాగులు, చెప్తూ వీడియోలను పోస్ట్ చేశారు. అయితే బెంగళూరు డ్రైవర్ ఈ స్మగ్లింగ్ కి బాగా ఇన్స్పైర్ అయిపోయి.. అదే ట్రిక్ ను ఉపయోగించి స్మగ్లింగ్ చేయాలని అనుకున్నాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. డ్రైవర్ ఈ స్మగ్లింగ్ కి బాగా ఇన్స్పైర్ అయ్యి దీంతో ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయాలని అనుకున్నాడు.

అతని పేరు ఆసీన్ ఇనాయతుల్లా. కర్ణాటక ఆంధ్ర బోర్డర్ నుంచి మహారాష్ట్ర కి ఎర్ర చందనం ని ట్రక్ లో తీసుకు వెళుతూ ఉండగా.. గాంధీ చౌక్ వద్ద మహారాష్ట్ర పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 2.45 రూపాయల కోట్ల ఎర్రచందనం ని సీజ్ చేశారు. అలానే 10 లక్షల రూపాయలు కూడా పోలీసులు సీజ్ చేశారు.

దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. మాకు అందిన సమాచారం ప్రకారం జాయింట్ ఆపరేషన్ చేశామని.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశామని వాహనాన్నీ సీజ్ చేశామని చెప్పారు. సుమారు ఒక టన్ను ఎర్ర చందనంని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ డ్రైవర్ పుష్ప రేంజ్ లో స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేశాడని అంన్నారు. అలానే పుష్ప సినిమాలో పాలని తీసుకు వెళ్తూ స్మగ్లింగ్ చేసినట్లు ఈ వ్యక్తి ఎర్రచందనం కింద పెట్టి పైన పండ్లు, కూరగాయలు బాక్స్ లని పెట్టాడని చెప్పారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news