కోనసీమ ఉద్రిక్తతల్లో టీడీపీ, జనసేన హస్తం : హోంమంత్రి వనిత

-

ఏపీ ప్రభుత్వం ఇటీవల చేసిన కొత్త జిల్లాల ప్రకటన కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. కొన్ని జిల్లాల్లో జిల్లా పేర్లపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కోనసీమలో తీవ్ర ఘర్ణణ వాతావరణం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ నేడు అమలాపురంలో చేపట్టిన నిరసనలో హింసాత్మక రూపుదాల్చడం తెలిసిందే. ఆందోళనకారులు పోలీసులపైనా దాడులకు ప్రయత్నించడం, మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఇళ్లకు నిప్పంటించారు కూడా.

Vanitha assures justice to victim of molestation in Vizag

అయితే.. కాగా, అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయని వెల్లడించారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదని అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసిందకు గర్వించాలని తానేటి వనిత వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news