ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన పాలనపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తిపై రూ. 2 లక్షల భారం ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని, దాని వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. విశాఖ కేజీహెచ్లో 534 మంది మద్యం తాగి అనారోగ్యం పాలయ్యారని, వారిలో 200 మంది చనిపోయేలా ఉన్నారని పురంధేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. మరోసారి దేశంలో నరేంద్ర మోడీ ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు.