ఏపీలో ఎలక్ట్రిక్ వాహానాలను ప్రొత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది జగన్ సర్కార్. ఈ మేరకు కేంద్రానికి వివిధ ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఏపీ ప్రభుత్వం పంపింది. ఇవే విషయాలను నీతి ఆయోగ్ దృష్టికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఎలక్ట్రానిక్ వాహానాలను ప్రొత్సహించేందుకు రాష్ట్రం ముందుకు వస్తే.. 60 వేల మంది ఉపాధి లభిస్తుందని అంటున్నారు అధికారులు.
మరో నాలుగేళ్లల్లో ఏపీలో 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మరో మూడేళ్లల్లో రాష్ట్రంలో లక్ష ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. 2024 నాటికి రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాలలో అన్ని ఫాసిల్ ఫ్యూయల్ వాహనాలను తొలగొంచాలని యోచనలో సర్కార్ ఉంది. 2024 నాటికి అన్ని ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ గా మార్చాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. 2029 నాటికి ఏపీఎస్సార్టీసీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడిపేలా కూడా సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.