ఏలూరు వింత వ్యాధి : మరో ఇద్దరి మృతి

-

ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న రాత్రి నుంచి కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. మొత్తం కేసుల సంఖ్య ప్రస్తుతం 592గా ఉంది. ఇందులో 511 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. విజయవాడ,  గుంటూరు ఆసుపత్రిలకు 33 మంది తరలించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇక ఏలూరు వింతవ్యాధికి సంబంధించి వివిధ సంస్థల  పరిశీలన ముగిసింది. ఏలూరు నుండి కేంద్ర త్రిసభ్య నిపుణుల కమిటీ బయలుదేరి వెళ్ళింది. రెండు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. హైదరాబాదు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ  నేడు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక సీసిఐటి నివేదిక కూడా నేడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news