కమల్ సినిమాలో విలన్ గా మళయాల హీరో..

-

లోక నాయకుడు కమల్ హాసన్ గా చాలా రోజుల తర్వాత ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్టుతో ముందుకు వచ్చాడు. కార్తీతో ఖైదీ సినిమా తీసి అందరి దృష్టిలో పడ్డ లోకేష కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ పేరుతో థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కమల్ హాసన్ పుట్టినరోజున రిలీజైన విక్రమ్ టీజర్ ఎంత ఆసక్తి కలిగించిందో అందరికీ తెలుసు. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ మళ్ళీ మరో మంచి సినిమాతో వస్తున్నాడని అందరూ ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులెవరా అని ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ విషయాలు ఇంకా వెల్లడి కానప్పటికీ తాజా సమాచారం ప్రకారం విక్రమ్ సినిమాలో విలన్ గా నటించేది ఎవరో తెలిసిపోయింది. కమల్ ని ఢీ కొనడానికి ఎవరు నటిస్తుందో బాగుంటుందన్న విషయంలో అనేక చర్చలు జరిపిన తర్వాత మళయాల హీరో ఫాహద్ ఫాజిల్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా సమాచారం బయటకి రానప్పటికీ ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇదే గనక నిజమైతే కమల్ హాసన్ సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news