రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే, దీనిపై వివాదం నడించింది. సరే! ఈ విష యాన్ని పక్కన పెడితే.. వాస్తవానికి ఈ నెలలోనే ఎన్నికలు జరిగి ఉంటే.. ఖచ్చితంగా ఈ రోజే(సోమవారం) ఎన్నికల ఫలితాలు వచ్చి ఉండేవి. కానీ, వాయిదా పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఊసు లేకుండా పోయింది. పైగా కరోనా విషయమే ఇప్పుడు ఎక్కడ విన్నా..కన్నా కనిపిస్తోంది.
ఇక, ఈ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అనే ప్రశ్నకు తాజాగా అధికార వర్గాల నుంచి వచ్చిన స మాధానం ఆగస్టు తర్వాతే అని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కలకలంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమా లు నిలిపివేసి.కేవలం ప్రజలకు అందించాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేయడం, కరోనా వ్యాప్తిని అరి కట్టే చర్యలు, పేషంట్ల సంఖ్య పెరగకుండాచూడడం వంటి వాటికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తోం ది. దీనికితోడు కరోనా లాక్‌డౌన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 14 వరకు కరోనా లాక్‌డౌన్ ఉంది.
అయినప్పటికీ కూడా.. ఆ రోజుకు పరిస్థితిని అంచనావేసుకుని తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారని అధికార వర్గాల నుంచే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మే రెండో వారం వరకు కూడా లాక్‌డౌన్ కొనసాగు తుంది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకునేందుకు మరో నెల రోజులు సమయం పడుతుం ది. ఈ లోగా పాఠశాలలు తెరవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఇంతలో ప్రజలకు పంచాల్సిన ఇళ్ల పట్టాలు వంటివి చేపట్టి.. అమలులోకి తీసుకువచ్చే సరికి జూలై తొలి వారం లేదా రెండో వారం కావొచ్చు. అంటే వర్షాలు పడే సమయానికి ముందుగానే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లనున్నారు. ఇదంతా కార్యరూపం దాల్చేసరికి సమయం పడుతుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.