కరోనా వైరస్ ప్రభావం ఎవరికి తగిలిందో తెలియదు గాని సిని పరిశ్రమకు మాత్రం గట్టిగానే తగిలింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పట్లో ఏ సినిమా కూడా షూటింగ్ జరుపుకునే అవకాశాలు దేశంలో కనపడటం లేదు. దీనితో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఏ సినిమా విడుదల చేసే అవకాశాలు కనపడటం లేదు ఇప్పుడు. సినిమాల షూటింగ్స్ అన్నీ కూడా వాయిదా వేస్తున్నారు. కరోనా ఎప్పుడు కట్టడి అవుతుందో తెలియడం లేదు.
కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కష్టపడుతున్నా సరే అది సాధ్యం కావడం లేదు. మన తెలుగులో చాలా సినిమాలు ఈ ఏడాది విడుదల చెయ్యాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చే వకీల్ సాబ్, చిరంజీవి హీరోగా వచ్చే ఆచార్య సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా వచ్చే ఒక సినిమా విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు ఏ మాత్రం కనపడటం లేదు.
చాలా సినిమాలు విదేశాల్లో షూటింగ్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పట్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీనితో ఈ ఏడాది సినిమాలు విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పటికే విడుదల చెయ్యాల్సి ఉన్న సినిమాలను వాయిదా వేసారు. మన తెలుగులోనే ఈ ఏడాది 21 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయినా సరే ఏ ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే పరిస్థితి లేదు. సినిమా హాల్స్ కూడా ఇప్పట్లో ఓపెన్ చేసే పరిస్థితి లేదు.