ఏపీలో మరో మంత్రికి కరోన పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఈరోజు ఉదయం ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్ అని తేలగా కొద్ది సేపటి క్రితం బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస గోపాల కృష్ణ కు కారోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈయన కూడా తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఏపీ సిఎం జగన్, మంత్రి వెల్లంపల్లి తదితరులతో కలిసి పాల్గొన్నారు.
అంతే కాక నిన్న అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభోత్సవం, జగ్గంపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమాల్లో కూడా మంత్రి పాల్గొన్నారు. దీంతో మంత్రితో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారులలో కలవరం మొదలయింది. ఇక ఇదే కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కూడా పాల్గొన్నారు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు మంత్రులకి కరోనా అని తేలడంతో ఇతర మంత్రులు, అధికారులలో కూడా టెన్షన్ మొదలయింది.