రాజకీయాల్లో పార్టీలు మారడం కప్పు కాఫీ తాగినంత ఈజీ అయిపోయింది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి కొడుగు పట్టడం నేటి రాజకీయ నాయకులకు సర్వసాధారణ విషయం. ఇప్పుడు ఇదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప్రతి పక్ష పార్టీ టీడీపీకి సంకటంగా మారింది. ఇప్పటికే చాలా మంది టీడీపీని వీడి అధికార వైసీపీ పంచన చేరుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మాజీ కేంద్ర మంత్రి కూడా చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధికారంలో వుండగా కేంద్ర మంత్రిగా కేంద్రంలో చక్రం తిప్పిన పనబాక లక్ష్మి టీడీపీని వీడాలనుకుంటోందట. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో వున్న పనబాక ఆ సమయంలోనే పార్టీ మారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా టీడీపీ అధికారం కోల్పోవడంతో ఈ పార్టీని కూడా వీడాలని భావిస్తోందట. బీజేపీ హవా నడుస్తున్న నేపథ్యంలో ఆమె బీజేపీ లోకి జంప్ కావాలని ప్లాన్ చేస్తోందట. క్యాడర్ కూడా పార్టీ మారాల్సిందే అంటూ చెబుతుండటంతో పనబాక బీజేపీవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పలు మార్లు కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన పనబాకకు బీజేపీ రెడ్ కార్పెట్ పరుస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.