నేడు ఏపీ మంత్రి వర్గ కీలక సమావేశం…!

నేడు ఏపీ గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతుంది. మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హల్ లో ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మంత్రులు కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతుంది. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం, హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడీసివర్ ఇంజక్షన్స్,పలు అంశాలపై కీలకంగా చర్చ జరుగుతుంది.

మంత్రులు బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి , బొత్స సత్యనారాయణ , మేకతోటి సుచరిత , కురసాల కన్నబాబు , సిదిరి అప్పలరాజు కూడా హాజరు అవుతున్నాయి. ఏపి డీజీపీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు, పలువురు ఇతర శాఖల అధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఏపిఐఐసి 12వ ఫ్లోర్ లో మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమావేశ వివరాలు చెప్తారు.