కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ..కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

-

6 MLCs Join Congress in Telangana: కాంగ్రెస్ పార్టీలోకి BRS వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాసేపటి క్రితం సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, దండే విటల్, దయానంద్, బస్వరాజు సారయ్య, భాను ప్రకాష్, ఎగ్గే మల్లేశంలకు సీఎం రేవంత్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

6 MLCs Join Congress in Telangana

ఉదయం నుంచి అమావాస్య ఉండడంతో అర్ధరాత్రి పార్టీలో చేరారు. ఈ చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం 12 కి చేరింది. అటు BRS మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరి రాకను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.

దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి త్వరలో అన్ని అడ్డంకులను క్లియర్ చేసి మామా అల్లుళ్లను కాంగ్రెస్‌లోకి తెస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news