కాసేపటి క్రితమే ప్రివిలేజ్ కమిటీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ అచ్చెన్న, నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని… వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న, నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు తీసుకునే సమయంలో తాను అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారు.. అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదు దారు చెబుతున్నారన్నారు.
ఆధారాలు సమర్పించమని ఇద్దరికీ చెప్పామనీ పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకొచిృన ఆధారాల పరిశీలన అనంతరం కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని.. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తనపై వచ్చి ఫిర్యాదు విషయంలో మరింత సమాచారాన్ని కోరారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదనేం లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోయిండొచ్చని పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై అసెంబ్లీలో అచ్చెన్న, నిమ్మలకు మైక్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సభకు సిఫార్సు చేయనుంది ఏపీ ప్రివిలేజ్ కమిటీ.