సంక్షేమ పథకాల్లో ఏపీ రోల్ మోడల్ : సజ్జల రామకృష్ణారెడ్డి

-

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు దూసుకెళ్తున్నారు.ఈ క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధర్మవరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… అధికార వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి పాలనను అంతమొందించేందుకే తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.ఏపీలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘ధర్మవరం సభలో మా ప్రభుత్వంపై అమిత్ షా చంద్రబాబు చెప్పిందే మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న చెడు అంతా ఇక్కడే ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో ఏపీ రోల్ మోడల్. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏపీలో అవినీతి జరిగింది. వారి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి’ అని కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news