డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం తీసుకున్న ఎస్సీ మహిళలకు రూ.1లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు కూడా చేపట్టింది.అయితే, ఎస్సీ మహిళలకు అందించే ఈ రుణంలో రూ.50 వేల వరకు రాయితీ ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇచ్చిన మొత్తంలో రూ.50 వేలు లెస్ చేయగా.. మిగిలిన మొత్తానికి వడ్డీ కూడా ఉండదు.
ఎస్సీ మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్న ఎస్సీ మహిళలకు రూ.1లక్ష నుంచి రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.ఆ లోన్ మొత్తాన్ని కనిష్టంగా 24 నెలల నుంచి గరిష్టంగా 60 నెలల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది.ప్రభుత్వ రాయితీని చివర్లో అందిస్తారు.త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.