ఆంధ్ర ప్రదేశ్ లో వరుణుడు విలయతాండవం చేస్తున్నాడు. భారీ వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ జన జీవనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా భారీ వర్షాలకు చాలా మంది చనిపోయారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల వల్ల నష్ట పోయిన వారికి సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ సారి వదరల తో మృతి చెందిన తక్షణ సాయం కింద రూ. 5 లక్షలు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే చెయ్యేరు నది ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువలును పూర్తిగా అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇళ్ల లో కి వరద నీరు వచ్చినా.. వారికి కూడా సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల లోకి నీరు వచ్చిన వారికి రూ.2000 సాయం అందించాలని అధికారులను ఏపీ సీఎం జగన్ అదేశించారు. అలాగే తిరుపతి లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తిరుపతి మున్నిపాలిటీ అధికారులను అదేశించారు.