పోరాడి గెలిచింది…202 రోజులు కరోనాతో పోరాడిన మహిళ

-

కరోనా చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమ ఆత్మీయులను కోల్పోయిన చాలా కుటుంబాలు ఇంకా ఆ బాధలోనే ఉన్నాయి. కొంత మంది కోట్ల రూపాయలను ఆసుపత్రులకు ధారపోసినా.. ప్రాణాలు దక్కలేదు. ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు చేసిన తమ వారిని కాపాడుకోలేకపోయిన వారెంతమందో ఉన్నారు. కాగా గుజరాత్ లోని ఓ మహిళ మాత్రం ఏకంగా 202 రోజులు కరోనాతో పోరాడి గెలిచింది. మహమ్మారిపై పోరాడి విజయం సాధించింది. ఆమె శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకోవడంతో.. కుటుంబ సభ్యుల్లో ఆనందం వెళ్లివిరిసింది.

వివరాల్లోకి వెళితే గుజరాత్ దహోద్ పట్టణానికి చెందిన గీతా ధర్మిక్ (45) మే 1న కరోనా బారిన పడింది. ఆమె భర్త రైల్వే ఉద్యోగి కావడంతో సమీపంలోని రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. అంతకు ముందు ఎప్రిల్ 23న తన మామ గుండె పోటులో చనిపోతే భోపాల్ వెళ్లామని .. అక్కడే కరోనా ఎటాక్ అయిందని.. గీతకు కరోనా లక్షణాలు కనిపించాయని భర్త త్రిలోక్ ధార్మిక్ తెలిపారు. పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చిందని పాజిటివ్ తేలిందన్నారు ఆయన.

ఆస్పత్రిలో చేరిన వెంటనే వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. దాదాపుగా 202 రోజులు మహమ్మారి తో పోరాడి విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news