ఏపీ స్కూళ్లలో కరోనా టెన్షన్..ఆమూడు జిల్లాల్లో భారీగా కేసులు…!

-

ఏపీలోని పాఠశాలల్లో కరోనా కలకలం రేగింది. నవంబర్‌ రెండున ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించింది. పటిష్టమైన జాగ్రత్తల మధ్య స్కూళ్లను నిర్వహిస్తున్నా.. కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తునే ఉంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం హైస్కూల్‌లో కరోనా కేసులు బయటపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకం వంట మనిషికి కరోనా సోకింది. దీంతో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయులు అబ్జర్వేషన్‌లో ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కూడా కరోనా కలకలం సృష్టించింది. పదిమంది స్కూల్ విద్యార్థులకు పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు కరోనా వచ్చిన పిల్లలను ఇంటికి పంపిచేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో అయితే ఉపాధ్యాయుల్ని వెంటాడింది కరోనా మహమ్మారి. రెండు రోజులుగా జరిగిన కరోనా పరీక్షల్లో 120 మంది టీచర్లకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నెల్లూరు జిల్లాలోనూ కరోనా కలకలం మొదలైంది. మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్‌లోని 50 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. మోడల్ స్కూల్‌లో పనిచేసే వాచ్‌మెన్‌తో పాటు అతని కుటుంబసభ్యులకు వైరస్‌ సోకింది.ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో కూడా కరోనా టెన్షన్‌ మొదలైంది. నలుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news