రేపు మరో అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోమరిన్ ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న శ్రీ లంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించియున్నది. వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రము లో సుమారు రేపు అనగా నవంబర్ 30 , 2021 వ తేదీ కల్లా ఏర్పడవచ్చును. ఇది పశ్చిమ వాయువ్య దిశ గా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళా ఖాతం మీద వాయుగుండం గా బలపడే అవకాశం ఉంది. వీటి ఫలితంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో…. మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

మరి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news