తిత్లీ తుఫాన్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే…ఏపీని మరో తుఫాన్ వెంటాడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రం వైపుగా దూసుకొస్తోంది. ఇది నెల్లూరు జిల్లా శ్రీహరి కోటను 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘గజ’గా పేరు పెట్టగా.. దీని ప్రభావం ఏపీతో పాటూ తమిళనాడుపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో సంబంధిత ప్రాంతాల్లో ఈ నెల 14 నుంచి 17 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు