తెలంగాణలో తెరాస తరపున బరిలోకి దిగనున్న 107 మంది అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బి-ఫారాలను అందజేశారు. ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యంకాదు గెలుపే ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారికి తెలిపారు. దీంతో సోమవారం నుంచి నామినేషన్ల పర్వం సాగనుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయి.
19వ తేదీ వరకు నామినేషన్లకు ముగియడంతో పాటు..వచ్చేనెల 5 వరకూ ప్రచారం కొనసాగుతుంది. 25 రోజుల పాటు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి కష్టపడితే విజయం సాధించవచ్చని తెలిపారు. అభ్యర్థులంతా విధిగా అన్ని మండలాలు, పురపాలక సంఘాలు, ముఖ్య గ్రామాలు, వార్డులను సందర్శించాలని తెరాస అధినేత ఆదేశించారు. గ్రేటర్ హైదరాబద్ పరిధిలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారంటూ వారికి భరోసా కల్పించారు.