నవంబర్ 11- 18 రాశి ఫలాలు: ఈ రాశివారు కార్తీక స్నానాలు ఆచరిస్తే మంచిది!

-

November 11 to 18 weekly horoscope

మేషరాశి: ఈ వారం ప్రశాతంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా బంధువులతో సఖ్యంగా ఉంటారు. వ్యాపార రంగంలోవారికి అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువు, ఇతర విషయాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొత్త పనుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. సూర్యోదయం సమయంలో నమస్కారాలు, అమ్మవారి దేవాలయాల సందర్శన, చండీదీపం పెట్టడం వల్ల దోషాలు తగ్గుతాయి.

వృషభ రాశి: ఈ వారంలో అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సఖ్యత. రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు. ధైర్యంతో పనులు చేయండి. వ్యాపారములలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈవారం ఈరాశివారు పనుల్లో విఘ్నాలు తొలగడం కోసం గణపతి ఆరాధన, విష్ణు, శివాలయాల సందర్శన, పూజలతో మంచి జరుగుతుంది.

మిథునరాశి: ఈవారం గ్రహాలు అనుకూలత కొంత తక్కువగా ఉంది. చేసే పనుల్లో సమస్యలు వస్తాయి. ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. వారం చివరలో కొంత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషవాతావరణం. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు. మంగళ, గురు, ఆదివారాల్లో ఒక్కపూట భోజనం చేయండి. హనుమాన్ దేవాలయ సందర్శన, సింధూర ధారణ మంచి చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ వారంలో అంతా అనుకూలం. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు. దేవీ సంబంధ దేవాలయాలు, పారాయణం, విష్ణు సహస్రనామ పఠనం మంచిచేస్తుంది.

సింహరాశి: గ్రహానుకూలత. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆఫీసులో సంతృప్తి కరమైన వాతావరణము ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. దేవాలయ సందర్శన, పేదలకు దానధర్మాలు చేయడం వల్ల శుభం కలిగే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈవారం మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. బంధువులు, అన్నదమ్ములతో సఖ్యత. అనవసర వివాదాల్లో దూరవద్దు. వ్యాపారంలో కొంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. శ్రీకృష్ణ, రామాలయాలు సందర్శన, లక్ష్మీపారాయణం మంచి చేస్తుంది.

తులారాశి: ఈవారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలల్లో ఉన్న వారికి అనుకూలం. కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు. బంధుమిత్రులతో సఖ్యత ఉంటుంది. ఉదయం పూట విష్ణు సంబంధ ఆలయాలను దర్శించండి. వీలైతే కార్తీక దీపారాధన చేయండి. అంతా శుభం జరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈవారం మిశ్రమంగా ఉంటుంది. పెద్దల సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలం. కుటుంబంలో, బంధువులతో వివాదాలు రావచ్చు. కాబట్టి వాదాలకు, మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. న్యాయపరమైన సమస్యలు. ప్రయాణాలు అనుకూలించవు. మీ మంచితనం మిముల్ని రక్షిస్తుంది. కార్తీక స్నానం, దీపారాధన, నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచిది.

ధనుస్సు రాశి: ఈ వారం అనుకూలం. కుటంబ సౌఖ్యం. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దేవాలయ సందర్శన, కార్తీక పూజలు చేయండి.

మకర రాశి: ఈవారం అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో కొంత ఇబ్బందికర వాతావరణం. బంధువులతో, అన్నదమ్ములతో వివాదావకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కార్యసిద్ధి కోసం నిరంతర ప్రయత్నం అవసరం. అదృష్ట యోగం ఉంది. విఘ్ననివారణకు గణపతి ఆరాధన, ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో రెండు తులసి దళాలు నోట్లో వేసుకొని వెళ్లండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి: శుభకాలం. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. అన్ని రకాల వ్యాపారులకు అనుకూల కాలం. ఉద్యోగంలో ఉన్నవారికి చిన్నచిన్న సమస్యలు రావచ్చు. అనవసర విషయాల జోలికి వెళ్లవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతారాధన, కార్తీక మాస సంబంధ పూజలు, దేవాలయ దర్శనం మంచి ఫలితాలను ఇస్తాయి.

మీన రాశి: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కానీ అన్ని విషయాలను తేలికగా తీసుకోవద్దు. వ్యాపారులకు అనుకూలం. మీరుచేసే పనులను దైవస్మరణతో ప్రారంభించండి. ఇతరుల జోక్యం రానీయకండి. దైవబలంతో ముందుకు సాగిపోతారు. కార్తీకమాస స్నానాలు, శివ, విష్ణు పూజలు చేయండి. వీలైతే అన్నదానానికి విరాళం లేదా స్వయంగా అన్నదానం చేయండి. మంచి ఫలితం వస్తుంది.

కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Latest news