యాదాద్రి కిలో బంగారం ప్రకటించిన ఏపీ మహిళ..!

తెలంగాణలో యాదాద్రి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కాగా ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓజెడ్పిటిసి కిలో బంగారాన్ని యాదాద్రి కోసం విరాళంగా ఇచ్చింది. కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త చిన్నమండెం జెడ్పీటీసీ జయమ్మ కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తాను తన కుటుంబ సభ్యులు కలిసి కిలో బంగారాన్ని ఆలయానికి ఇస్తున్నట్టు జయమ్మ ప్రకటించింది.

దీనికి సంబంధించిన చెక్కులను ఆలయ అధికారులకు ఇస్తామని విజయమ్మ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే పలువురు టీఆర్ఎస్ నేతలు ఇతరులు ఆలయ నిర్మాణం కోసం బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా తమ నియోజకవర్గం నుండి ఆలయ గోపురం కోసం కిలో బంగారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏపీ నుండి ఒక మహిళా జెడ్పిటిసి ఆలయం కోసం కిలో బంగారం ప్రకటించడం విశేషం.