రాష్ట్రపతి పాలనపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

నిన్న టీడీపీ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు చేసిన ఆ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం సలహా దారులు సజ్జల కౌంటర్‌ ఇచ్చారు. ఒక రాయి చూపించి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారు.. ఇది అత్యంత దారుణమని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎందుకు చంద్రబాబు అంత ఆత్రం ప్రదర్శించారు ? ఏం ఉద్దేశ్యాలు ఉన్నాయని నిలదీశారు సజ్జల.

ఏపీ లో శాంతి భద్రతలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. ఇతర పార్టీల వాళ్ళు ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళా హోంమంత్రి పై కూడా అయ్యన్నపాత్రుడు సంకనాకండి అనే పదం వాడారని… సీఎంను చెత్తనాకొడుకు అని వ్యాఖ్యానించారని… ఈ స్థాయి మాటలు ఎందుకు వస్తున్నాయని ఫైర్‌ అయ్యారు.

ప్రజాస్వామ్య బద్దంగా ఉండబట్టే ఇంత వరకు వచ్చిందన్నారు. లేకపోతే చెత్తనా కొడుకు అన్నప్పుడే చెత్తలో వేసి తొక్కేసి ఉండేవాళ్ళని చురకలు అంటించారు సజ్జల. ఒక నిస్పృహ చంద్రబాబు, లోకేష్, టీడీపీ లో కనిపిస్తున్నాయని.. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారన్నారు. వాటి పై స్పందిస్తే పెంట పై రాయి వేసినట్లు అవుతుందని మేము సంయమనం పాటిస్తూ వచ్చామని చెప్పారు.