విజయవాడలో “ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలు” చీఫ్ గెస్ట్ గా జగన్

ఈ రోజు విజయవాడలో “ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలు” ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆప్కాబ్ కొత్త లోగో ను ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆప్కాబ్ లో కొత్తగా తీసుకువచ్చిన సంకల్ప్ ప్రాజెక్టు ను సైతం సీఎం జగన్ ప్రారంభించారు. ఇక ఆప్కాబ్ సంస్థ కోసం అహర్నిశలు పనిచేసి ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చిన డీసీసీబీ, పీఎసీలు,బ్రాంచి ఉద్యోగులకు అవార్డులను అందించారు సీఎం. ఇంకా వీరిలో 13 మంది డీసీసీబీ లకు సీఎం జగన్ డివిడెంట్ లను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ , ఒక రైతు విత్తనం కొనుక్కుని వేయడం నుండి పంటను కోసే వారికి వివిధ దశలలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే రైతులు చాలా మంది ఎక్కువ వడ్డీలకు తీసుకున్న అమౌంట్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

కానీ మన ప్రభుత్వంలో అలా జరగకూడదని బ్యాంకు లద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండడం వలనే ఇప్పుడు వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు వచ్చాయి అంటూ గర్వంగా చెప్పారు సీఎం జగన్.