అమరావతి రాజధాని రైతులకు ఆంధ్ర ప్రదేశ్ సీఎస్ గుడ్ న్యూస్ తెలిపారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలవడంతో రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలపైగానే భూములిచ్చారు.2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవగానే 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ రాజధాని భూములను అభివృద్ధి చేయలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారే వరకూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం మారడంతో రాజధానిని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది.
దీంతో రాజధాని రైతులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలొచ్చాయని తెలిపారు. ఉద్దండరాయుని పాలెం దగ్గర రాజధాని కోసం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ,పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ తయారు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాజధాని ప్రాంత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమరావతి రాజధానిలో 25 ప్రాంతాలను గుర్తించామని, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.