కేంద్రమంత్రివర్గంలో తనకు చోటు కల్పించడం పట్ల నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.” బీజేపీ కార్యకర్తగా నా జీవితం ప్రారంభమైంది.
గత 34 సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తున్నాను. నా రాజకీయ ప్రయాణంలో సహకరించిన, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నరసాపురం టికెట్ నాకు దక్కినప్పుడు కార్యకర్తలంతా నా విజయాన్ని కాంక్షించారు అని అన్నారు. రాయలసీమ నుంచి కూడా పలువురు తరలివచ్చి ప్రచారం నిర్వహించారు అని గుర్తు చేశారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు నా గెలుపు కోసం కృషి చేశారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఈ పదవి ఓ నిదర్శనం” అని వర్మ అన్నారు.