జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్నాళ్లు గుడ్డి గాడిద పళ్ళు తోమాడా? అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ ను ఆపటానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పవన్ కు కనపడదా? అంటూ ప్రశ్నలు కురింపించారు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బిజెపిని పవన్ ఎందుకు ఒక్క మాట అనరు అని అప్పల రాజు నిలదీశారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బిజెపికి బద్వేల్, తిరుపతి ఎన్నికల్లో ఎలా మద్దతు ఇచ్చారంటూ అప్పల రాజు ప్రశ్నించారు.
చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ చదువుతున్నాడని…చంద్రబాబు దృతరాష్ట్ర కౌగిలినుంచి పవన్ బయటకు రావాలని అప్పలరాజు వ్యాఖ్యానించారు. అమిత్ షా దగ్గర పలుకుబడి ఉందని పవన్ చెబుతున్నాడని….తన పలుకుబడి ఉపయోగించి ఉక్కు ఫ్యాక్టరీ ని కాపాడాలని అప్పలరాజు అన్నారు.
ప్యాకేజి మాటలు కట్టిపెట్టాలని…పవన్ విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అంటూ అప్పలరాజు సంచలన ఆరోపణలు చేశారు.