ఉద్యోగ ప్రకటనలు ఫుల్లు… నియామకాలు నిల్లు- మధుయాష్కీ

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని, ఉద్యోగాల భర్తీపై ప్రకటనలేమో ఫుల్లుగా చేస్తున్నారని.. నియామకాలు మాత్రం నిల్లే నని కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆరోపించారు. గడిచిన కొంత కాలంగా డీఎస్సీ, గ్రూప్ 1,2 నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ నీళ్లను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలను కలపాలని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అని.. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ అభివ్రుద్దికి కట్టుబడి ఉందని అన్నారు. కల్వకుంట్ల సామ్రాజ్యాన్ని విస్తరించేందుకే ఆలోచనలో భాగంగానే తెలుగు రాష్ట్రాను కలపాలని చూస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు కొట్లాడి, ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ దయవల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని వెల్లడించారు మధుయాష్కీ. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ విధానాలకు వ్యతిరేఖంగా 33 జిల్లాల్లో నవంబర్ 14 నుంచి 21 పాటు ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. దాదాపు 2300 కిలోమీటర్ల ప్రజాచైతన్య పాదయాత్ర జరుగుతుందని 119 నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామని మధుయాష్కీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news