ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్, వాచ్ ల వినియోగదారులకు నూతన ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా జరిగిన యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2021లో యాపిల్ ఆయా ఓఎస్‌లకు సంబంధించిన ఫీచర్ల వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే ఐఓఎస్ 15, ఐప్యాడ్ ఓఎస్ 15, వాచ్ ఓఎస్ 8 లలో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం.
యాపిల్ ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో మెయిల్ ప్రైవసీ ప్రొటెక్షన్, యాప్ ప్రైవసీ రిపోర్ట్, ఐక్లౌడ్ ప్లస్, హోమ్ కిట్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఐప్యాడ్ ఓఎస్ 15లో నూతన హోమ్ స్క్రీన్ డిజైన్‌ను అందిస్తున్నారు. అలాగే క్విక్ నోట్, షేర్ ప్లే, రీడిజైన్డ్ సఫారి ఎక్స్‌పీరియెన్స్, ట్రాన్స్‌లేట్, ప్రైవసీ కంట్రోల్స్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
నూతన ఐప్యాడ్ ఓఎస్‌లో విడ్జెట్స్‌ను యాప్స్ మధ్యలో పెట్టుకోవచ్చు. అలాగే ఫైండ్ మై, కాంటాక్ట్స్, గేమ్ సెంటర్, యాప్ స్టోర్‌లకు నూతన విడ్జెట్స్‌ను అందిస్తున్నారు. యాప్ లైబ్రరీ ద్వారా యాప్‌లను మనకు కావల్సినట్లు అమర్చుకోవచ్చు. దీంతో వాటిని త్వరగా యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది.
అలాగే ఫేస్ టైమ్ స్పేషియల్ ఆడియో, వాయిస్ ఐసొలేషన్, ఐప్యాడ్ ట్రాన్స్‌లేషన్ యాప్, లైవ్ టెక్ట్స్ సెర్చ్, ఫోటోస్ మెమొరీస్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను ఐప్యాడ్ ఓఎస్ 15తో అందిస్తున్నారు. ఇక వాచ్ ఓఎస్ 8 లో ఫొటోలను ప్రత్యేకంగా అరేంజ్ చేసుకునే ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే హోమ్ యాప్‌ను రీడిజైన్ చేశారు. కొత్తగా వాలెట్ అనే సదుపాయాన్ని అందిస్తున్నారు. కొత్త వర్కవుట్లను అందిస్తున్నారు. మైండ్ ఫుల్ నెస్ యాప్ లభిస్తుంది.
కాగా ఐఓఎస్ 15ను సెప్టెంబర్ వరకు లాంచ్ చేస్తారు. ఈ ఓఎస్ ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8 ప్లస్, 7, 7 ప్లస్, 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ మొదటి జనరేషన్, రెండో జనరేషన్, ఐపాడ్ టచ్, ఐఫోన్ 12, 12 మిని, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్, 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్, ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఆర్ ఫోన్లలో లభిస్తుంది.
ఇక వాచ్ ఓఎస్ 8 యాపిల్ వాచ్ సిరీస్ 3 ఆపైన వాచ్‌లలో లభిస్తుంది. అలాగే ఐప్యాడ్ ఓఎస్ 15 ఐప్యాడ్ ఎయిర్ 2 ఆపైన ట్యాబ్‌లు, అన్ని ఐప్యాడ్ ప్రొ మోడల్స్, ఐప్యాడ్ 5వ జనరేషన్ ఆ తరువాత డివైస్‌లు, ఐప్యాడ్ మినీ 4 ఆ తరువాత డివైస్‌లలో లభిస్తుంది. ఈ ఓఎస్‌లను కూడా సెప్టెంబర్ వరకు అందుబాటులోకి తెస్తారు.