ఎయిర్ పాడ్స్ ప్రో కొన్నవారికి యాపిల్ గుడ్ న్యూస్…!

-

ఎయిర్ పాడ్స్ ప్రో లో లోపం ఉంటే వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని యాపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్ పాడ్స్‌ లో ఏ ఎన్ సి సమస్యలు ఉంటే లేదా అది క్రాక్లింగ్ లేదా స్టాటిక్ సౌండ్‌ తో చికాకు పెడుతుంటే మాత్రం వాటిని ఫ్రీ గా రిపైర్ చేయడం లేదా కొత్త వాటిని ఇస్తామని యాపిల్ పేర్కొంది. అక్టోబర్ 2020 కి ముందు తయారు చేసిన ఎయిర్‌ పాడ్స్ ప్రోలో కొంత మేర ఇబ్బందులు ఉన్నాయి అని యాపిల్ పేర్కొంది.

విమానం వెళ్తున్నట్టు వాటిల్లో సౌండ్ వస్తుంది. దీనితో వాటి విషయంలో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. రిపైర్ కోసం ఆపిల్ డబ్బు వసూలు చేయదు అని… ఎక్కడైనా యాపిల్ సర్వీస్ సెంటర్ లో ఉచితంగా మార్చుకోవచ్చు అని తేలింది. అయితే రిపైర్ చేసిన తర్వాత వారంటీ మాత్రం కొత్తగా ఏమీ పొడిగించే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news