పీఎం ఆవాస్ యోజన పథకం కోసం ఇలా సులువుగా అప్లై చేసుకోండి..!

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఈ పథకం ద్వారా పేద వాళ్లకి ఇళ్ళని ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి ఇల్లులేని వాళ్ళకి ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇళ్ళని కొనుగోలు చేసే వాళ్ళకి సబ్సిడీని అందిస్తోంది. అయితే ఈ స్కీం కింద ఎవరు బెనిఫిట్ పొందగలరు అనేది ఇప్పుడు చూద్దాం…!

పీఎం ఆవాస్ యోజన పథకం కోసం ఇలా అప్లై చేయండి:

దీని కోసం ప్రభుత్వం ఒక ఆప్ ని తీసుకు రావడం జరిగింది. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని లాగిన్ ఐడి ని క్రియేట్ చేసుకుని… ఈ బెనిఫిట్ ని పొందొచ్చు. ఆ తర్వాత యాప్ నుండి మీకు ఓటిపి పంపిస్తుంది.

లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ ఫిల్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఫీల్ చేయండి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్లై చేసిన వాళ్ళల్లో ఫైనల్ లిస్ట్ తీస్తుంది. వాటిని PMAYG వెబ్ సైట్ లో పెడుతుంది.

ఇది ఇలా ఉండగా మొట్టమొదట ఈ పథకాన్ని పేదలకు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇలా కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్ వలన ఇల్లు లేని వారు బెనిఫిట్ ని పొందవచ్చు.