ఈ లక్షణాలు ఉన్నాయా అయితే కరోనా టీకా అస్సలు తీసుకోవద్దు !

-

మిగతా అన్ని దేశాల కంటే భారత దేశంలో కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 45 ఏళ్ల పైన వారికి మాత్రమే కరోనా టీకా అర్హత ఉంటే ఇప్పుడు కొత్తగా 18 ఏళ్లు దాటిన ఎవరైనా టీకా వేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే ఒకటో తారీకు నుంచి ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.. అయితే టీకా వేయించుకునేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటే కరోనా టీకా వేయించుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జ్వరంగా ఉన్నప్పుడు కరోనా టీకా అస్సలు తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జ్వరం లాంటివి ఉంటే కనుక ఆ జ్వరం పూర్తిగా తగ్గిన తరువాత మాత్రమే తీసుకోవాలని అంటున్నారు.. ఒకవేళ అలర్జీ లాంటిది ఉన్నా సరే ఆ అలర్జీ తగ్గాకనే టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాక ఇక మొదటి డోస్ కరోనా టీకా  వేయించుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది తలెత్తే రెండో డోస్  తీసుకోవద్దని చెబుతున్నారు.. అంతేకాక ఇమ్యూనిటీ మీద ప్రభావం ఉన్న మందులు వాడేవారు గర్భిణీలు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు కూడా ఈ టీకా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news