మొరింగ ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్ మరియు అమైనో యాసిడ్స్ వంటి అవసరమైన పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. మొరింగ ఆకులు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున చర్మ ఆరోగ్యానికి ఈ ఆకును ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మొరింగ ఆకు ప్యాక్‌లను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఈరోజు మనం ములగ ఆకుతో ఎన్ని రకాల ఫేస్ ప్యాక్‌లు వేసుకోవచ్చు చూద్దాం.
మొరింగ ఆకులతో చేసే కొన్ని ఫేస్ ప్యాక్‌లను తెలుసుకుందాం…
ఒక టేబుల్ స్పూన్ మోరింగ ఆకులను రెండు టేబుల్ స్పూన్ల తేనెతో కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ మోరింగ ఆకులను రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. డల్‌నెస్‌ని తొలగించి ముఖం కాంతివంతంగా మార్చేందుకు ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది.
ఒక టేబుల్ స్పూన్ మొరింగ ఆకుల పొడికి ఒక టేబుల్ స్పూన్ అవకాడో గుజ్జు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి మరియు కొద్దిగా రోజ్ వాటర్ ను ఒక టేబుల్ స్పూన్ పొడి మొరింగ ఆకులను వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ మెరిసే ముఖానికి కూడా మంచిది.
మొరింగ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడం చాలా మంచిది. ఈ ఆకు ఊర్లర్లో విపరీతంగా దొరుకుతుంది. తెచ్చుకోని ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే..మీకు టైమ్ ఉన్నప్పుడల్లా అప్లై చేసుకోవచ్చు. మొరింగ ఆకు పౌడర్‌ను వాటర్‌లో కలుపుకోని తాగిన మలబద్ధకం సమస్య తగ్గుతుంది, కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గేందుకు ఈ ఆకు పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే పౌడర్ తాగితే వాటర్ కూడా ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.