ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంస్థలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇందులో పూర్తిగా అప్రెంటీస్‌కు చెందిన ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1,146 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటన ద్వారా లె లిసింది. అందులో ఎలక్ట్రీషియన్, టర్నర్, డ్రాఫ్ట్ మెన్, డిజిల్ మెకానిక్స్, వెల్డర్స్ ఇతర ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన అర్హతా వివరాలు ఇలా ఉన్నాయి.
పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ రంగాల్లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి.
వేతన వివరాలు
ఈ జాబ్‌లో సెలెక్ట్ అయినవారికి నెలకు రూ.8050 రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన వారికి వర్తిస్తుంది. మరి ఏడాది ట్రైనింగ్ చేసిన వారికి నెలకు రూ.7,700 చొప్పున ఉపకార వేతనం ఇవ్వనుంది.
అయితే, 80:20 నిష్పత్తిలో లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టులు కేటాయిస్తారు. అంతేకాదు ఐటీఐ ఉత్తీర్ణతలో సీనియారిటీ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అంటే లోకల్‌గా ఉన్న కేండిడేట్స్‌కు వందలో 80 మందిని సెలెక్ట్ చేస్తే, నాన్‌లోకల్ అభ్యర్థులను 20 మందిని ఎంపిక చేస్తారన్నమాట. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే ఏడాది ఉత్తీర్ణత సాధించి ఉంటే.. వారిలో మెరిట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తుకు ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్–రిజిస్ట్రేషన్ లింక్ https://scclmines.com/apprenticeship/ ఇతర వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్ ఆధారంగా వివరాలు తెలుసుకోగలరు. అర్హత వివరాలు సరిగ్గా చూశాకే దరఖాస్తు చేసుకోవాలి.