నిరుద్యోగులకు శుభవార్త. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. (NPCIL ఎన్‌పీసీఐఎల్) రిక్రూట్‌మెంట్ 2021 ఆధారంగా 107 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో అప్రెంటీస్‌షిప్ చేయాలి. అప్రెంటీస్ షిప్ చేస్తున్న అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ వొకేషనల్ ట్రేడ్ ద్వారా పరీక్ష ఉంటుంది. ఇందులో పాస్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. ఇక ఎంత పే చేస్తారు అనేది చూస్తే.. నెలకు రూ.8,855 స్టైఫండ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు ITI కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 9, 2021 నాటికి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసుగాని 24 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు అనర్హులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా మినిస్టరీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రినిషిప్ (Ministry of Skill Development and Entrepreneurship) అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు తమ పేరును నమోదు చేసుకోవాలి. ఐటీఐ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏదైనా ప్రభుత్వం లేదా పీఎస్‌యూ(PSU) లేదాప్రైవేట్ పారిశ్రామిక సంస్థలో అప్రెంటీస్‌షిప్ చట్టం 1961 ప్రకారం ఇప్పటికే అప్రెంటీస్‌షిప్ పొందిన లేదా ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. పోస్టుల వివరాలు చూస్తే.. ఫిట్టర్- 30, టర్నర్- 4, మెషనిస్టు- 4, ఎలక్ట్రీషియన్- 30, ఎలక్ట్రానిక్ మెకానిక్- 30, వెల్డర్- 04, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 05. https://npcilcareers.co.in/RAPS2021/candidate/Default.aspx