ఉత్తరాఖండ్‌ లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్‌

-

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి ఎగతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. అయితే.. ఈ నేపథ్యం లో డెహ్రడూన్‌ ను సమీపంలోని రాణి పోఖారి – రాణిపోఖారి-రిషికేష్ హైవేపై జఖాన్ నది వద్ద ఉన్న వంతెన..నీటి ప్రవాహం దాటికి ఒక్క సారిగా కూలి పోయింది.

దీంతో బ్రిడ్జి కింద పడిపోయాయి కొన్ని వాహనాలు. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్లిన వాహనాలు.. అందు లో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవు తోంది. ఇక వీడియోను చూసిన వారు షాక్‌ అవు తున్నారు. అటు ఘటన పై స్పందించిన జిల్లా ఎస్పీ… బ్రిడ్జి దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దారి గుండా వచ్చే వాహనాలను మళ్లిం చామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news