ఏప్రిల్ 28 అడవి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబలి సాహో అనిపించింది…!

-

ఏప్రిల్ 28 తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు నెమరవేసుకున్నారు. ఈ రోజు తోనే ఎన్టీఆర్ తో తన సినీ ప్రయాణం మొదలయింది అని చెప్పారు. ఏప్రిల్ 28, నా సినీ జీవితంలో ఓ మరుపురాని రోజు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్తానం మరో మెట్టు ఎక్కిన రోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు.

ఒక్క మాటలో చెప్పాలి అంటే అది చరిత్ర సృష్టించిన రోజు. 43 ఏళ్ళ క్రితం అడవి రాముడు విడుదలైన రోజు. ఆ నందమూరి ఆడఐ రాముడిని మరోసారి గుర్తు చేసుకుంటూ ఆ సినిమా నిర్మాతలకు, నటీ నటులకు సాంకేతిక నిపుణులకు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, ఆ చిత్ర దర్శకుడిగా చట్టం ఆఫ్ ద షిప్ గా… నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అడవి రాముడు రికార్డుల రాముడిగా ఎలా మారిందో కొన్ని ఉదాహరణలు…

4 సెంటర్లలో ఒక సంవత్సరం పాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహాల్ థియేటర్ లో ప్రతీ రోజు 5 షోస్ 100 రోజుల పాటు ఆడటం మరో విశేషం. బంగారానికి తాని అబ్బినట్టు ఏప్రిల్ 28 నాదే నా సమర్పణలో వచ్చిన బాహుబలి చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అడవి రాముడు ఆహా అనిపిస్తే బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సాహో అనిపించినా సంగతి మీకు తెలిసిందే.

ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులు అందరికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. రెండు పండుగలని ఒకే రోజు అందించిన ఏప్రిల్ 28 కరోనా మహమ్మారిని తుది ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ, అదే నిజమైన వేడుక అని భావిస్తూ, ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీసు విభాగానికి, పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ శ్రీనివాసుడి కరుణా కతాక్షాలతో భారతదేశం భవ్య దేశంగా విరాజిల్లాలని కోరుకుంటూ మీ రాఘవేంద్ర రావు… అని ఆయన ఒక పోస్టర్ విడుదల చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news