ఏపీఎస్ ఆర్టీసీ ద‌స‌రా ఆదాయం 209 కోట్లు : సురేంద్ర‌బాబు

-

APSRTC Earns 209 crore Revenue in Dussehra 2018
న‌ష్టాల‌తో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీకి ద‌స‌రా ఆస‌రా ఇచ్చింది. దసరా సందర్భంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన 5,778 బస్సుల ద్వారా 5.30లక్షల మంది ప్రయాణించారని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ స్టేట్స్‌కు బస్సులు నడిపామని వివరించారు. గత ఏడాది ఆదాయం(రూ.194 కోట్ల)తో పోల్చితే ఈ ఏడాది రూ.15కోట్లు అదనంగా(రూ.209కోట్లు) వచ్చినట్టు తెలిపారు. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించిన సిబ్బందిని అభినందించారు. తితిలీ బాధితుల‌కు 2 కోట్ల రూపాయ‌ల విరాళం అంద‌జేయ‌నున్నట్లు సంఘం నేత‌లు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news