గుర్మిత్‌జీ.. నీకు హేట్సాఫ్.. నీ సంపాదనను రోజూ దానం చేస్తున్నందుకు..!

-


రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా బిచ్చగాళ్లు కనిపించి.. అయ్యా.. బాబ్బాబు.. ఓ రూపాయి ఉంటే ఇయ్యండయ్యా.. అని అడిగితే.. మనకు ఎక్కడలేని కోపం తన్నుకొస్తుంది. ఎహె.. ఈ బిచ్చగాళ్లను నీనే దొరికానా? అని తెగ ఫీలవుతుంటాం. వాళ్లేదో మన ఆస్తి అడిగినట్టు. కొంతమందైతే బిచ్చగాళ్లను చాలా చీప్‌గా చూస్తారు. డబ్బులు ఇవ్వకపోగా..వాళ్లను తిట్టిపోస్తారు.

కానీ.. ఇటువంటి వాళ్లంతా ఓసారి గుర్మిత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శం అనే పదం కూడా సరిపోదేమో.. అంతకు మించి అనాలి. పాట్నాకు చెందిన ఈ చిరు వ్యాపారి.. తన రోజువారి సంపాదనలో 10 శాతం దానం చేస్తున్నాడు. ఇప్పుడు కాదు.. గత 26 సంవత్సరాల నుంచి ఆయన ఇలా దానం చేస్తున్నాడు. పాట్నా ఆసుపత్రిలో రోగులకు తనకు చేతనైనంత సేవ చేస్తున్నాడు గుర్మిత్. అక్కడికి వచ్చే పేద రోగులకు తను రోజూ ఆహారం అందించి కడుపు నింపుతున్నాడు. పాట్నాలో ఓ చిన్న వస్త్రదుకాణం ఉంది గుర్మిత్‌కు. రాత్రి కొట్టు మూసేసిన తర్వాత నేరుగా పాట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ అవసరమైన వారికి ఆహారాన్ని అందిస్తాడు. ఒక్కోసారి మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేని వారికి తనే మందులు కొనిస్తాడు. ఇలా.. తమ సంపాదనలో 10 శాతాన్ని సమాజ సేవ కోసం అంకితం చేసే వాళ్లు ఎంత ముంది ఉన్నారు ఈ దునియాలో. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లలో గుర్మిత్ ఒకరు. ఆయన రోగులకు చేస్తున్న సేవలకు గాను లండన్ లో వరల్డ్ సిక్కు అవార్డుతో సత్కరించారు. గుర్మిత్ నువ్వు గ్రేట్. నీకు హేట్సాఫ్. నీలాంటోళ్లు రాష్ర్టానికి ఒక్కరున్నా చాలు.. దేశం బాగుపడి పోతుంది. సొంత వ్యక్తులను కూడా పట్టించుకునే సమయం లేని ఈ జనరేషన్‌లో నువ్వు 26 ఏళ్ల నుంచి అలుపెరగకుండా రోగులకు ఆహారాన్ని అందిస్తున్నావంటే అంత ఈజీ కాదు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నిరూపించావు నువ్వు.

Read more RELATED
Recommended to you

Latest news