తెలంగాణకు బస్సు సర్వీసుల పై ఏపీ ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు

-

లాక్ డౌన్ పూర్తి అయి అన్ లాక్ మొదలయ్యాక అన్నీ అందుబాటులో కి వచ్చాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం తిరగడం లేదు. ప్రయివేటు బస్సులు తిరుగుతున్నా ఆర్టీసీ బస్సులు మాత్రం రోడ్డు ఎక్కలేదు. ఈ విషయం మీద ఇరు రాష్ట్రాల అధికారులు ఎన్నో మార్లు కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఈ అంశం మీద ఎపిఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎన్ని కీమీ లు బస్సులు తిప్పుతుందో అంతే ఏపీ బస్సులు తిప్పాలని అంటుందని, అంటే
లక్షా 60 వేల కీమీ లనే ఇరు రాష్ట్రలు తిప్పుదాం అంటుందని అన్నారు. ఏపీ తిప్పుతున్న 1లక్షా 10 వేల కీమీ దగ్గరే ప్రతిష్టంభన నెలకొందని ఆయన అన్నారు.ఈ లక్ష 10 వేల కీమీ బస్సులు తగ్గించండి అని తెలంగాణ అంటుందని పోనీ మేము తగ్గిస్తాం మీరు పెంచండి అంటే తెలంగాణ కుదరదు అంటుందని ఆయన అన్నారు.
మనం బస్సులు తగ్గిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ కి లబ్ది చేకూరుతుందని అన్నారు. 725 ప్రైవేట్ బస్సులు ఇప్పటికే తిరుగుతున్నాయని, లక్ష 10 వేల కీమీ తగ్గిస్తే ప్రైవేట్ బస్సులు ఇంకా పెరుగుతాయని అన్నారు. 1లక్ష 60 వేలు కీమీ తిప్పటానికి మేము సిద్ధం అనే చెప్పామని
అన్నారు. ఆర్టీసీ కి దసరా టైం చాలా కీలకం కావడంతో అది తేలే వరకు అయినా ముందుగా 70 వేల కీమీ తిప్పుదాం అని ప్రతిపాదన పెట్టామని, ఇంకా దీని మీద ఎలాంటి నిర్ణయం తెలంగాణ నుండి రాలేదని అన్నారు.
మంత్రి స్థాయి లో చర్చలు జరిగితే అంతరాష్ట్ర సర్వీసుల పై ఒక క్లారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version