ఏపీ ప్రజలకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తరచూ బస్సు చార్జీలు పెంచుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా, సంస్థ ప్రయాణికులకు గొప్ప ఊరట కలిగించే ప్రకటన చేసింది. నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తగ్గింపు తాత్కాలికమేనని, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది.
తాజా నిర్ణయంతో పలు రూట్ల లో నడిచే ఏసి బస్సుల్లో 10 నుంచి 20% మేరా చార్జీలు తగ్గాయి. కాగా, ఆయా రూట్లు, వాటిలో ఎంత మేర చార్జీ తగ్గించాలన్న అంశాన్ని మాత్రం రీజనల్ మేనేజర్లకు అప్పగించింది. ఈ నేపథ్యంతో తమ పరిధిలోని రూట్లు, వాటిలో తిరిగే బస్సుల్లో చార్జీల తగ్గింపునకు సంబంధించి రీజనల్ మేనేజర్లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విజయవాడ ఏసి బస్సుల్లో ఛార్జీలను 10% తగ్గించారు.