తెలంగాణలో రాహుల్ గాంధీ 370కి.మీ పాదయాత్ర..ఎప్పుడంటే

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందన్న విషయం స్పష్టం. ఈ నేపథ్యంలోనే.. తన బలాన్ని నిరూపించుకునేందుకు… కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుగడలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన తెలంగాణ షెడ్యూల్ ఫిక్స్ చేసింది కాంగ్రెస్‌. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 24న మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర అడుగుపెట్టనుందని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేర్కొన్నారు.

13 నుంచి 15 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 330 నుంచి 370 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఎవరెవరు పాదయాత్రలో పాల్గొనాలి, రూట్ మ్యాప్ వంటి విషయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 150 రోజులపాటు 3,500 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news