నిరుద్యోగులకి APSSDC గుడ్ న్యూస్.. ఇలా అప్లై చేసుకోండి..!

-

నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకి మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే ..

 

నిరుద్యోగులకి/ APSSDC

గతం లో కూడా ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. తాజాగా మరొక నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఈ సంస్థ. KAPTON FACILITES MANAGEMENT LIMITED సంస్థలో ఉద్యోగాలను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఉచితంగా భోజనం, వసతి సదుపాయం అందించనున్నారు.

అర్హులైన వాళ్ళు ఈ నెల 12లోగా రిజిస్టర్ చేసుకోవాలి. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ అండ్ మిషన్ ఆపరేటర్స్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.

ఇక విద్యార్హత గురించి చూస్తే… ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2019, 20, 21 సంవత్సరాల్లో పాసైన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించారు.

వయస్సు వచ్చేసి 18-25 ఏళ్లు ఉండాలి. పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 6300125455, 8317545920 నంబర్లను సంప్రదించ వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news